Kasturi Vijayam

అధికారం మాటున దురంహకారం

దురహంకార గుణం అనేది నిత్యం ఆత్మతో పూర్తిగా అజ్ఞానం కలసి ఉన్నప్పుడు పుట్టుకొచ్చే గుణం.దీనిని ఇంగ్లీష్ లో నార్సిసిస్టిక్ పర్సనాలిటీ అంటారు. ఈ లక్షణం కల్గినవారు తమ ఎదుగుదలకు వేరేవారిని అవసరార్ధం వాడుకుని అవసరం తీరాక ‘బోడి మల్లన్న’ అన్నట్లు ఉంటారు. అంతేగాకా మితిమీరిన పదవి వ్యామోహాన్ని కల్గిఉంటారు. ఒకసారి పదవి చేజిక్కాక ఇక ఏమిచేసినా చెల్లుబాటవుతుందని అనుకొంటారు. ఏ పనిచేసిన పక్షపాతంతో తనకి నచ్చిన వారికి మాత్రమే లబ్ది కలిగేలా ఆలోచిస్తారు.మరోవైపు ఎటువంటి సమస్య ఎదురైనా తమకున్న చతురతతో తిమ్మిని బమ్మి చెయ్యగలమని విశ్వసిస్తారు. తెలుగు వారి జీవిత చరిత్రలను ఆధారంగా చేసుకుని ఏడుతరాల చారిత్రక, రాజకీయ,సామజిక సంఘటనలతో పరిశోధనాత్మక రాయబడిన “మా చెట్టు నీడ అసలేం జరిగింది” లోని కొన్ని దూరంకార ఘటనలు ఆధారాలతో మీ ముందుకు….పుస్తకంలో సంభాషించిన ఏడుతరాల చరిత్రలో, మొదటితరంకు చెందిన రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడులోని దురహంకార గుణంతో పుస్తకం తెరుచుకుంటుంది. నాయుడుకున్న దురహంకార గుణంతో పదవే ధ్యేయంగా తనకున్న పదవి వ్యామోహంతో అతని సొంత పెదనాన్న కొడుకులను మోసగించి, అయిన వారు అని కూడా చూడకుండా చింతపల్లి కారాగారంలో నిర్బంధించి, తన రాజ్యంతోపాటు వారి సంస్థానాలను కూడా లాగేసుకున్న గొప్ప ఘనుడు. అలాగే తననుకున్న కార్యం నెరవేరిన తర్వాత తన వెంట నిలిచిన సొంత కులం వారిలో కూడా చిన్న కమ్మ, పెద్ద కమ్మ అని చీలిక తెచ్చిన కృష్ణా మండల సంస్థానాధీశుడు.తన రాజ్యం కోసం బ్రిటిష్ వారి దురంహకార ఆలోచనల అడుగులకు మడుగులేత్తి వెన్నేముక లేని తాను ఏమిచేస్తున్నాడో తనకే అవగాహనా లేకుండా అమాయకపు నల్లమల్ల చెంచులను నమ్మించి చింతపల్లిలోని తన సంస్థానానికి తీసుకొచ్చి, అతి దారుణాతి దారుణంగా వారిని నరికి చంపి ఆ ప్రాంతానికి నరకులపాడుగా నామకరణం చేసిన దురహంకారి. చెంచు వారిపై దొంగలు, పిండారీలు అని బ్రిటిషు వారితో కలసి అసత్య ప్రచారం చేసి చరిత్రనే వక్రీకరించాలని ప్రయత్నించాడు. చెంచువధ తర్వాత తన మనోస్థితి చెడి, సంస్థానంలో చెంచు ప్రేతాత్మలు తిరుగుతున్నట్లు, తాను తింటున్న ఆహరం మానవ మలవిసర్జితంగా కనిపించడంతో భయపడి మంచం మీద పడి పిచ్చిచూపులు చూస్తుంటే చింతపల్లి సైన్యాధ్యక్షుడైన భుజంగరాయుడు అమరావతి నగరం నిర్మాణంలో సాయపడి, కోటను నిర్మాణం చేసాడు, ఐతే సంస్థానాధీశుడు మీద వున్నా గౌరవంతో కోటను నిర్మించింది నాయుడే అన్నాడు.ఎప్పటిదో ఇప్పుడు మాకెందుకు అంటే, ఈ తరంలో జరిగింది ఏదయినా చెప్పాలంటే మరో ఉదాహరణగా ఈ పుస్తకం లోనిదే అసలేం జరిగింది అన్న కోణంలో ఆరవ తరం సంగతులలో భాగంగా…..అదేంటో చూద్దాం…220 సంవత్సరాల తర్వాత మన ‘బాబు’ గారు వున్నపలాన రాత్రికి రాత్రి తన మంది మార్బలంతో అమరావతికి వచ్చి, కొత్తగా అమరావతి పట్టణ నిర్మాణం అనే తంతు కూడా ఈ దురహంకార గుణం లోంచి పుట్టుకొచ్చిన మొక్క లాగానే అనిపిస్తుంది. బాబుగారి దురహంకార గొప్పదనానికి రూపంగా చెప్పు కోవాల్సిన మరో గొప్ప కథ గోదావరి పుష్కరాలకు దారేది కధనంతో ,నిత్యం అజ్ఞానాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలలోకి పంపుతూ, సామాన్య ప్రజలను అను నిత్యం మోసపరిచే విధానాలలో తనలోని దురహంకార గుణంకి తానే పదును పెట్టుకుంటూ, అదే తన బలంగా భావించే మన బాబుగారు తన ఎథ్నోసెంట్రిజం ద్వారా సాంప్రదాయ మౌఢ్యాన్ని సమాజంపై ఎగదోసి గోదావరి పుష్కరాలకు ముదనష్టపు ముహుర్తాలు పెట్టించి తన చుట్టూ అల్లుకున్న మీడియా ద్వారా మా గొప్ప వారిచే మా గొప్పగా ప్రవచనాలు చెప్పించారు. సామాన్య ప్రజలలో ఉన్న సాంప్రదాయ ఆలోచనలే వేదికగా చేసుకుని , తన ప్రచార యావతో రాజమండ్రిలోని గోదావరికి నాలుగు విఐపి రేవులుంటే వాటిని కాదని తానేదో గొప్ప ఘనకార్యం చేస్తుంన్నట్టు నమ్మించడానికి, సామాన్య రేవులో కుటుంబ సమేతంగా పితృకర్మలు చెయ్యడంలో నారా వారి కుటుంభం మొత్తం తెగ జీవించి నటించేసింది. కార్యక్రమం మొత్తం చిత్రీకరించడానికి ప్రముఖు సినీదర్శకులు పాల్గొని, ఆ చిత్రీకరణలో ఇంచుమించుగా రెండు గంటలు పైన సమయం తీసుకున్నారు . ఈ కార్యక్రమం జరిగే అంతవరకు ప్రజలను రేవులోకి అనుమతించకుండా బయటే CM సెక్యూరిటీ రూపేణా జనాన్ని నిలిపేశారు. ఆతంతు అంతా పూర్తయి ప్రజలని రేవులోకి అనుమతించేసరికి అప్పటికే అక్కడ పుష్కర స్నానానికై ఎదురుచూస్తున్న సామాన్య ప్రజానీకం, ముహర్తపు గడియ దాటిపోతుందని ఒక్కసారిగా గోదావరి రేవులోకి దూసుకొచ్చారు. తొక్కిసలాట జరిగింది. అమాయకులైన 35 మంది దాకా ప్రజలు గోదావరి పుష్కరాలలో చనిపోయారు. బాబు గారు తన దురహంకారంతో జరిగిన ఈ దుర్ఘటనలో తానేం చేసిన చెల్లుబాటవుతుందన్న మూర్కత్వపు ఆలోచనల నుండి పుట్టుకొచ్చినదే ఒక ఉత్తుత్తి కమిటీ. ఈ కమిటీ కూదా దోషులెవరో తేల్చకుండానే ప్రజలను ఏమార్చి పక్కదారి పట్టించింది. ఈ ఘటనలో కూదా ప్రముఖంగా చెప్పుకోవాల్సింది తిమ్మిని బమ్మిని చేసే బాబు గారి లోని దురహంకార గుణ లక్షణం .మనలో మన మాట గౌరవనీయులైన మాజీ సుప్రీం కోర్ట్ జడ్జి గారు ఒకరు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు , నారా చంద్ర బాబు నాయుడు గారు ఇద్దరు ఒకటే రోజు(అదే ఏప్రిల్ యిరవై వ తారీఖున) పుట్టారని, వారిరువురి ఆలోచనలలో సారూప్యం ఉందని, పాలనలో పోలికలు ఉన్నాయని ఇద్దరికి రాజధాని నగరం అమరావతి అయ్యిందని … ఆ సుప్రీం కోర్ట్ జడ్జిగారు వేంకటాద్రి నాయుడు రెండు వందల సంవత్సరాల జన్మదిన వేడుకుల సందర్భంగా సభ ముఖంగా నిండు సభలో చెప్పడం కొసమెరుపు. అధికారం మాటున దురహంకారం పడగవిప్పి ఏమిచేసినా చెల్లుబాటవుతుందనుకొంటే చరిత్ర మాత్రం తన వ్యాక్యానాన్ని తనుకు తానుగా రాసుకొంటూ పోతుంది. అదే చరిత్రకున్న గొప్ప లక్షణం.

RELATED ARTICLES

మీరు కుకీస్‌ను అంగీకరిస్తే మాకు తెలియచేయండి